సిరాన్యూస్, కుందుర్పి
హరిజన ప్రసాద్‌కు మెమోంటోను అందజేసిన ఎమ్మెల్యే సురేంద్ర బాబు
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని బసాపురం గ్రామ పంచాయతీ పరిధికి చెందిన బి కొత్తూరు గ్రామానికి చెందిన హరిజన ప్రసాద్ తెలుగు పార్టీలో చురుగ్గా పని చేస్తున్నారు. హరిజన ప్రసాద్ టీడీపీ అప్లికేషన్ ద్వారా పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, టీడీపీ కార్యక్రమాలను సోషల్ మీడియాలో వేగంగా పోస్ట్ చేస్తూ నెటిజన్లకు సమాచారం అందిస్తున్నారు. గ్రామంలో పార్టీ కార్యకర్తలకు తన శక్తి మేరకు, సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఈనేపధ్యంలో ఈయన సేవలను గుర్తించి శనివారం కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు తన క్యాంపు కార్యాలయంలో హరిజన ప్రసాద్‌కు టీడీపీ గుర్తు మెమోంటో, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేకు బి కొత్తూరు, మాయదార్లపల్లి, బసాపురం, ఏళ్లచింత గ్రామాల టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.