సిరాన్యూస్, కోనరావుపేట:
మారుపాక రాములు సీఎం సహాయ నిధి చెక్కు అందజేత : కాంగ్రెస్ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా
సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన మారుపాక రాములకు శనివారం సీఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ. 10 వేల చెక్కను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేదలకు వరమని అన్నారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో వీటిని లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని అన్నారు. అనంతరం లబ్దిదారుడు మాట్లాడుతూ సిఎంఆర్ఎఫ్ చెక్కు రావడానికి కృషి చేసిన వేములవాడ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నందు గౌడ్, గ్రామ అధ్యక్షులు ఎక్కలదేవి శ్రీనివాస్, దేవయ్య భైరగోని శ్రీనివాస్, దేవేందర్, పోచయ్య, శ్రీధర్, హరీష్, దినకర్ రవి, రాజు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.