సిరాన్యూస్, దస్తురాబాద్
నల్ల పోచమ్మ ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తోందని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం గ్రామంలో 9 లక్షల 50 వేల నిధులతో నిర్మించనున్న నల్ల పోచమ్మ ఆలయ నిర్మాణ పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సబ్బండవర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని, గ్రామాల అభివృద్ధికి పార్టీలకతీతంగా పాటుపడాలని పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్దే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పల్లెబాట,పొద్దు పొడుపు-భోజ్జన్న అడుగు (మార్నింగ్ వాక్) ఫోన్ ఇన్ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. గ్రామంలో ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకోస్తే వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. త్వరలో ప్రజా పాలన కార్యక్రమం ఉంటుందని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ, ఎంపీపీ , ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు