సిరాన్యూస్, చిగురుమామిడి
నీలిగొండ దశరథ్‌కు అపరిచిత వ్యక్తి బెదిరింపు కాల్
నీకూతురును కిడ్నాప్ చేశాం... డబ్బులు పంపించకుంటే చంపేస్తామంటూ బెదిరింపులు
నీ కూతుర్‌ను కిడ్నాప్ చేసాం డబ్బులు పంపించకుంటే చంపేస్తామంటూ అపరిచిత వ్యక్తి చేసిన బెదిరింపు కాల్ మండలంలో సంచలనంగా మారింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన నీలిగొండ దశరథ్ అనే వ్యక్తి క్షౌరశాల నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.శనివారం ఉదయం పూట అతని ఫోన్ కి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఓ అపరిచిత వ్యక్తి హిందీలో మాట్లాడుతూ తాను పోలీసునని..నీ కూతుర్ని కిడ్నాప్ చేశామని ఆమె తమ వద్దే ఉందంటూ బెదిరింపులు చేశారు.ఫోన్ కట్ చేస్తే చంపేస్తామని ఫోన్ పే గూగుల్ పే ద్వారా డబ్బులు పంపియాలని బెదిరించారు. ఒకసారిగా దశరథ్ భయభ్రాంతులకు గురయ్యాడు. తన కూతురు కూడా ఇటీవల వాళ్ళ అమ్మమ్మ ఇంటికి సిద్ధిపేటకు వెళ్లడంతో మరింత ఆందోళన గురయ్యాడు. వెంటనే అప్రమత్తమై వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్సై బండి రాజేష్ ను సంప్రదించాడు.ఆపరిచిత వ్యక్తి సైబర్ నేరగాడంటూ పోలీసులు గుర్తించారు.ఇలాంటి సైబర్ నెరగాళ్ళ వాట్సప్ వీడియో ఆడియో కాల్ స్పందించకూడదని..అప్రమత్తంగా ఉంటూ వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.