సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలం నరసింహాపురం గ్రామం వద్ద కురుస్తున్న వర్షానికి శనివారం తెల్లవారుజామున వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. ద్విచక్ర వాహనంపై వాగు దాటే ప్రయత్నంలో బైక్ తో సహా వ్యక్తి కొట్టుకుపోయాడు. మధ్యలో చేట్టు పట్టుకుని కేకలు వేయడంతో, స్థానికులు గమనించి మోకు సహాయంతో సురక్షితంగా చెట్టు పట్టుకున్న వ్యక్తిని ఒడ్డుకు చేర్చారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.వెంటనే రెవిన్యూ,పోలీస్ శాఖ అప్రమత్తమై వాగు దాటకుండా బారికెట్లు పెట్టీ రెవిన్యూ సిబ్బందిని నియమించారు. ఈ సందర్భంగా పోలీసులు వర్షాల వల్ల వాగులు వంకలు పొంగిపోతున్న నేపథ్యంలో వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు