సిరా న్యూస్,కామారెడ్డి;
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ కేంద్రంలోని నిజాంసాగర్ కెనాల్ మూల మలుపు వద్ద నాందేడ్ నుండి బాన్సువాడకు వస్తున్న ఆటో మరియు బాన్సువాడ నుండి వర్ని వెళుతున్నా బొలోరో వాహనం ప్రమాదవశాత్తు ఢీ కొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నాందేడ్ జిల్లా విష్ణుపురి కి చెందిన పాంచాల్ ఉష అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై నస్రుల్లాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.