పలువురు సిబ్బంది సస్పెండ్
సిరా న్యూస్,అల్లూరి;
అల్లూరి సీతారామరాజు జిల్లా జామ్ గూడా ప్రభుత్వ పాఠశాలలో నిన్న రాత్రి జరిగిన సంఘటనను అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పందించి అరకులోయ ప్రభుత్వ ఆసుపత్రిలో జాముగూడా ప్రభుత్వ పాఠశాల బాలికలను ఆరోగ్య పరిస్థితి జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జామ్ కూడా ప్రభుత్వ పాఠశాల లో జిల్లా అధికారి సీరియస్గా తీసుకుని పలువురుని సస్పెండ్ చేస్తున్నట్టుప్రకటించారు. మధ్యాహ్నం పెట్టాల్సిన మెనూ రాత్రి మెనూలో పెట్టడం వల్ల అస్వస్థకు గురైనట్టు అధికారులు తెలియపరచారు.
ఇటువంటి సంఘటన జరగకుండా పాఠశాల పై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. అధికారులు సరైన పరీక్షణ లోపం వల్లే ఘటనాలు జరుగుతున్నాయని వారి పైన చర్యలు తప్పనిసరి తీసుకుంటామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.