సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని నూతన ప్రధాన రహదారి డివైడర్ మధ్యలో శనివారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలన్ని దృష్టిలో మొక్కలు త్వరగా నాటడానికి అవకాశం ఉంటుందన్నారు. ఖానాపూర్ పట్టణాన్ని మరింత సుందరీకరణంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ ,కౌన్సిలర్స్ నాయకులు పరిమి సురేష్ ,కిషోర్ నాయక్ ,కుర్మా శ్రీనివాస్ , మున్సిపల్ కమిషనర్ మనోహర్ , మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.