సిరా న్యూస్,మేడ్చల్;
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో పలు గ్రామాల్లోని వాగులు, చెరువులు నిండుకుని అలుగులు పారుతున్నాయి. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు మేడ్చల్ పెద్ద చెరువు అలుగులు పారుతుంది. అదేవిదంగా గౌడవెల్లి వాగు ఉదృతంగ ప్రవహించడంతో మేడ్చల్ నుండి గౌడవెళ్లి కి రాకపోకలు నిలిచిపోయాయి. మేడ్చల్ మండల వ్యాప్తంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చెరువులు, వాగుల వద్ద మేడ్చల్ సిఐ సత్యనారాయణ భారీ కేడ్లు ఎర్పాటు చేసి పోలిసు సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అటు శామీర్ పేట్ మండలంలోని అలియాబాద్ వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అలియాబాద్ గ్రామం నుండి బొమ్మరాసిపేట్ గ్రామానికి రాకపోకలు ఇలిచిపోయాయి. శామీర్ పేట్ సిఐ శ్రీనాథ్ ప్రజలెవరూ వాగు దాటకుండా భారి కేడ్లు ఏర్పాటు చేసి ఆయా చెరువుల వద్ద పోలీసు సిబ్బందిని నియమించారు. హకీంపేట్ లోని రాజీవ్ రహదారిపై చెట్లు విరిగి పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు, తూంకుంట మున్సిపాలిటీ సిబంది చెట్లను తొలగించి, ట్రాపిక్ ను క్లియర్ చేశారు. మూడుచింతలపల్లి మండలం లోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన డప్పు రాములు ఇంటిపై వేప చెట్లు విరిగిపడింది. ఉద్దేమర్రి గ్రామం నుండి కేశవపూర్, కీసరకు వెళ్ళే రోడ్డు పై చెట్లు విరిగి పడడంతో చెట్టును తొలగించారు. భారీ వర్షాల కారణంగా జిల్లా అధికారులు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నందున మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక కారణంగా మేడ్చల్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్ గౌతం సోమవారం సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా సహాయాక చర్యలకు ట్రోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశారు.