దంచి కొడుతున్న వానలు
రక్షణ సూచనలు చేసిన ఎస్ఐ కిరణ్ కుమార్
సిరా న్యూస్,తాండూర్;
తాండూర్ మండలంలో ఈరోజు నుంచి మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ఒర్రెలు పొంగి ప్రవహించే అవకాశం ఉ న్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండూర్ ఎస్ఐ కిరణ్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా ఎస్ఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి అత్యవసరం అయితే తప్ప ఎవరూ కూడా బయటకు రాకూడదన్నారు.అత్యవసర సమయంలో 100 నెంబర్ కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్ 8712 656575కి ఫోన్ చేయగలరని వెంటనే తమ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోవడం జరుగుతుందన్నారు. గ్రామాలలో పాత ఇండ్లు, గుడిశలలో, శిథిలావస్థలో ఉండే నివాసలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కూలిపోయే పరిస్థితిలో ఉంటే పోలీస్ వారికి సమాచారం అందిస్తే సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామన్నారు. అలాగే నది తీరా గ్రామాలలో పెద్దలు తమ పిల్లలను నదులలోకి, వాగుల వద్దకి వెళ్లకుండా చూడాలని, చేపలు పట్టే వారు చేపల వేటకు వెళ్లకూడదన్నరు. వాగులు వంకలలో కూడా నీటి ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలలో అప్రమతంగా ఉండాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా, విద్యుత్ వినియోగ దారులు మరియు ప్రజలు ఇంటిలో తడి చేతుల తో విద్యుత్ పరికరాలను మరియు తీగలను ముట్టుకో వద్దు ముఖ్యంగా బట్టలు ఆరేసే తీగలకు విద్యుత్ వైర్లు తాకకుండా చూసుకోవాలి అన్నారు. మండలంలోని వాగులన్నీ ప్రమాదకరంగా ప్రవహించే అవకాశం ఉండడంతో రోడ్లపై ఒర్రెలు వరద ప్రభావిత గ్రామాల ప్రజలు ఒర్రెలు దాటేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కువ నీరు ప్రవహిస్తున్నప్పుడు దాటకుండా వరద ప్రవాహం పూర్తిగా తగ్గిన తర్వాతనే చూసుకుని దాటాలని సూచించారు