Ambedkar Sangam Chepyala Prakash: కులం పేరుతో దూషించిన టీచర్లను సస్పెండ్ చేయాలి

సిరాన్యూస్‌, ఓదెల
కులం పేరుతో దూషించిన టీచర్లను సస్పెండ్ చేయాలి
తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్

ఎస్సీ ఎస్టీ విద్యార్థులను కులం పేరుతో అవమానించిన టీచర్లను వెంటనే సస్పెండ్ చేయాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ ప్రభుత్వాన్ని కోరారు. మంగ‌ళ‌వారం ఓదెల లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. శంషాబాద్ మండలం పాలమాకుల కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులను మీ ఎస్సీల దగ్గర వాసన వస్తది అని దుర్భాషలాడుతూ బూతులు తిడుతూ అవమానించడం కులం పేరుతో దూషించడం ఎంతవరకు సమంజసమని ప్ర‌శ్నించారు.టీచర్లు దళిత గిరిజనులు పాఠశాలలో ఎక్కడ కూడా గత 75 సంవత్సరాల నుండి ఈరోజు వరకు మాకు చదువుకునే స్వేచ్ఛ అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించి వారికి నాణ్యమైన విద్య,భోజనం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు, ఇటువంటివి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కస్తూర్బా పాఠశాలలతో పాటు మిగతా రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రభుత్వం ఇటువంటివి జరగకుండా కఠినమైన చర్యలు చేపట్టి నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *