అనంతలో క్రికెట్ సందడి

 సిరా న్యూస్,అనంతపురం;
అనంత క్రీడా గ్రామం క్రికెటర్లతో సందడిగా మారింది. దులీప్ ట్రోఫీ ఈ నెల 5 నుంచి క్రికెట్ మ్యాచులు ప్రారంభం అయి 22 వరకూ జరగనున్నాయి. ఇందులో స్టార్ క్రికెటర్లు రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, అర్ష దీప్ సింగ్, సాయి సుదర్శన్ తదితరులు పాల్గొంటారు. దులీప్ ట్రోఫీ క్రికెట్ పోటీల సందర్భంగా ఉదయం భారత్ – సి, డి – జట్ల క్రీడాకారులు వేర్వేరు సెషన్లలో ముమ్మరంగా నెట్ ప్రాక్టీసు చేస్తున్నారు. భారత్-సి జట్టు సారథి రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో.. అలెగ్జాండర్ హోటల్ నుంచి బస్సులో అనంత క్రీడా గ్రామం చేరుకున్నారు. నెట్ ప్రాక్టీసు, క్యాచింగ్, బంతి త్రో, ఇతర వ్యాయామాలు చేశారు. భారత్-డి జట్టు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో క్రికెటర్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ సాధన చేస్తున్నారు. మరోవైపు మైదానం, పెవిలియన్ ను బీసీసీఐ అధికా రులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *