– చవితికి ముస్తాబావ్వతున్న గణపతి పందిరిలు
సిరా న్యూస్,పరవాడ;
పరవాడ మండలంలో అన్ని గ్రామాలు వినాయక చవితి పండుగ సంబరాలకు ముస్తాబౌతున్నాయి. ఇప్పటికే పందిళ్లు వినాయక మందిరాలకు రంగులతో సిద్ధం చేస్తున్నారు.మండలంలో అన్ని గ్రామాలలో వినాయక విగ్రహం ప్రతిష్టకు ఏర్పాటులు చేస్తున్నారు స్థావరాలను బ్రహ్మాండంగా తీర్చి దిద్దుతున్నారు. విఘ్నలకు అధిపతి వినాయకునికి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతే ఏ కార్యక్రమైనా ప్రారంభించడం మన సంప్రదాయం అందుకే ప్రతి ఒక్కరూ చేపట్టే శుభకార్యాలు శుభప్రదంగా జరగాలని మొదటి పండుగ వినాయక చవితి ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటున్నారు. అయితే రూపాన్ని వివిధ ఆకృతుల్లో వైవిధ్యంగా తయారుచేసి అనేక చోట్ల యువకులు చలువ పందిళ్లు వేసి ప్రతిష్టించి పూజలు జరుపుతున్నారు వినాయకని పండగను గ్రామాలలో యువకులు పోటీలు పడి మరి వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.