సిరా న్యూస్,ఆదిలాబాద్
బాధిత కుటుంబాల సభ్యులకు అండగా ఉంటాం : ఎస్పీ గౌష్ ఆలం
1989 పోలీసు బ్యాచ్ మిత్రుల ఉదారత
* బాధిత ఏఎస్ఐ కుటుంబ సభ్యులకు రూ. 50 వేల చెక్కు అందజేత
బాధిత కుటుంబాల సభ్యులకు అండగా ఉంటాం ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ అలం అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని లింగాపూర్ లో విధులను నిర్వర్తిస్తున్న ఎఎస్ఐ నైతం నారాయణ ఈ సంవత్సరం జూలై 11 న అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను ఎలాగైనా ఆదుకోవాలని మంచి ఉద్దేశంతో తన తోటి మిత్రుడు బ్యాచ్ సభ్యుడు ఆయన నైతం నారాయణ కుటుంబ సభ్యులకు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా 1989 పోలీసు బ్యాచ్ కు సంబంధించిన పోలీసు మిత్రులు కలిసి 50వేల రూపాయలను జిల్లా ఎస్పీ గౌస్ ఆలం చేతుల మీదుగా భార్య సుశీల, కొడుకు ప్రవీణ్ లకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యులకు జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, ఎలాంటి సహాయ సహకారమైనా అందజేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుండి వచ్చే ప్రయోజనాలను వెంటనే అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోర్టు లైజన్ అధికారులు సయ్యద్ తాజుద్దీన్, ఈశ్వర్ సింగ్, రాఘువేంద్ర, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు ఏఎస్సై సుభాష్ సిబ్బంది కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.