సిరా న్యూస్,ఖమ్మం;
వరదలతో అతలాకుతలమైన తెలంగాణకు విరాళాలు,దాతల సహాయం వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ తమకు చేతనైన స్థాయిలో సహాయం అందిస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు.వరద బాధితులకు ఖమ్మంలోని 30 వ డివిజన్ పంపింగ్ వెల్ రోడ్ లోని రామకృష్ణ అనే వ్యక్తి ప్రతి ఇంటికి 25 కిలోల బియ్యం చొప్పున 300 మందికి అందిస్తూ ప్రశంసలు పొందుతున్నారు.రామకృష్ణ ఖమ్మంలోని ప్రశాంతి ఎమర్జెన్సీ క్లినిక్ పెట్టి అనస్థీషియ టెక్నిషియన్ గా పని చేస్తున్నారు.ఇటు తెలంగాణ అంబులెన్స్ సర్వీస్ నడుపుతున్నారు. ఇటీవల రామకృష్ణ ఉంటున్న కాలనీ వాసులు మున్నేరు వరదలతో ఇళ్ళు మునిగి సర్వం కోల్పోయారు. సాటి కాలనీవాసులు ఇబ్బందులు పడుతుంటే చలించిపోయిన రామకృష్ణ తనకు ఉన్న కొద్దిపాటి సంపాదనతోకాలనీ వాసులకు సాయం అందించారు.300 ఫ్యామిలు ఉన్న ఈ డివిజన్ కి ప్రతి ఇంటికి 25 కేజీ ల రైస్ బ్యాగ్, కూరగాయలు అందించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు.