సిరాన్యూస్, తిమ్మాపూర్:
పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యనారాయణ
తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను మంగళవారం కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కోడూరి రవీందర్ రావు తో కలిసి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ సంఘంలో నిర్వహిస్తున్న బ్యాంకును రైతులందరూ సద్వినియోగం చేసుకొని, సంఘ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్యకర్తలు, సంఘం నాయకులు పాల్గొన్నారు.