సిరాన్యూస్, ఖానాపూర్
తండ్రి ,కూతురులను సన్మానించిన తెలంగాణ రచయితల వేదిక నాయకులు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ప్రముఖ వైద్యులు డాక్టర్ వేణు గోపాల కృష్ణ నటించి దర్శకత్వం వహించిన ప్రేమతో నాన్న లఘు చిత్రం ఇటీవల నాలుగు నంది పురస్కారాలు పొందారు. ప్రేమతో నాన్న – ఉత్తమ చిత్రం డాక్టర్ వేణు గోపాల కృష్ణ – ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు ,ఉత్తమ నటిగా సుహాసిని బుధవారం నిర్మల్ తెలంగాణ రచయితల వేదిక (తేరవే) సంఘం నాయకులు ఘన సన్మానించారు. డాక్టర్ వేణు గోపాల కృష్ణ,సుహాసిని ఇద్దరు వైద్య విద్యలో వున్నారు. ఇద్దరూ తండ్రి కూతురు కావడం విశేషం. తెరవే అధ్యక్షులు హన్మంతు, కవులు చక్రాధారి, దామెర రాములు, మురళీ ధర్ తో పాటు సభా ద్యక్షులు కృష్ణంరాజు ఈ కార్యక్రమానికి దాత, ప్రముఖ కవులు రాజారావు,నారాయణ, దేవరావు,బీమేష్, పురుషోతంరావ్,పత్తి శివ ప్రసాద్,జగదీశ్వర్, తొడిశేటి పరమేశ్వర్ పాల్గొని డాక్టర్ వేణు గోపాల కృష్ణ,సుహాసిని ని శాలువ మెమోంటోతో ఘనంగా సన్మానించారు. అనంతరం సుహాసిని వేణు గోపాల కృష్ణని శ్రేయోభిలాషులు డాక్టర్ నీలిమ, వివేక్ కృష్ణ,రాజు, అభి,హరి,ఉదయ్ చంద్ర అభినందించారు.