సిరా న్యూస్,ఖమ్మం;
రఘునాథపాలెం మండలం మంచుకొండ వద్ద లారీ దగ్ధం అయింది. ఖమ్మం నుండి గొల్లచర్ల ఎరువుల లోడ్ తో వెళ్తున్న లారీ లో ఒక్కసారిగా మంటలు రేగాయి. ఇంజన్ నుంచి మంటలు రావడం గమనించిన డ్రైవర్ లారీని ఆపడంతో ప్రమాదం తప్పిందిజ మంటలను అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నం చేసారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేసారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనలో లారీ పాక్షికంగా దగ్ధమైంది.