డివైడర్ ను ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్ బస్సు..

15 మంది ప్రయాణికులకు గాయాలు
నలుగురికి తీవ్ర గాయాలు
సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు సమీపంలో ఆశ్రమం ఆసుపత్రి దగ్గర డివైడర్ను శ్రీ సాయి బాలాజీ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది. బస్సు హైదరాబాద్ నుంచి ఒడిస్సా వెళ్తూ ప్రమాదానికి గురైంది . ఘటనలో 15 మందికి గాయాలు కాగా, మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు జాతీయ రహదారి పోలీస్ మొబైల్ పెట్రోల్ టీమ్, 108 వాహనాల్లో ఏలూరు జనరల్ ఆసుపత్రి, , ఆశ్రమ్ హాస్పిటల్ కు తరలించారు. ప్రయాణికులు అంతా ఒడిస్సాకు చెందిన వారేనని సమాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *