సిరా న్యూస్,కాకినాడ;
దేవరపల్లి మండలం యర్నగూడెంలోని గండి చెరువు బ్రిడ్జి వద్ద వాగులో యువకుడు గల్లంతు అయ్యాడు. అతడికోసం గజ ఈతగాళ్ల సహాయంతో గాలిస్తున్నారు. సోమవారం సాయంత్రం బ్రిడ్జి సమీపంలో మోటార్ సైకిల్ అందులో సెల్ఫోన్ వాలెట్ వుండటం స్థానికులు గుర్తించారు. పర్సులోని ఐడి కార్డు పరిశీలించగా సుబ్బరాయపురం గ్రామానికి చెందిన సిహెచ్ శాంతారావు గా గుర్తించారు. శాంతారావు వాగులో గల్లంతు అయ్యాడని భావించి గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. బుధవారం ఉదయం కుడా మృతదేహం లభ్యం కాలేదు….