ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప
సిరా న్యూస్,పెద్దాపురం;
పెద్దాపురం మండలంలో ఏలేరు పరివాహక ప్రాంతాల్లో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధికారులతో కలిసి ఓ సాధారణ వ్యక్తిల షేర్ ఆటోలో పర్యటించారు. ప్రస్తుత పరిస్థితులపై అధికారుల్ని సహాయ చర్లపై వసతి పునరావాస కేంద్రాలు ఆర్మీ టీమ్ పంట నష్టం పలు విషయాలపై పెద్దాపురం ఆర్డీవో j. సీతారామారావుని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో ఏలేరు పరివాహక ప్రాంత సమస్యలపై ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు , మొబైల్ బ్రిడ్జి ఏర్పాటుకు నిర్మాణ వ్యయం సుమారు 50 లక్షలు ఉంటుందని కలెక్టర్ దృష్టిలో పెట్టమని జిల్లా కలెక్టర్ సగిలి సన్మోహన్ 50 లక్షల రూపాయలు నిధులు ఇస్తానని చెప్పారని త్వరలోనే మొబైల్ బ్రిడ్జి పనులను పూర్తి చేస్తామని , బ్రిడ్జి విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించిందని ఎమ్మెల్యే చినరాజప్ప తెలియజేశారు. అలాగే గ్రామస్తులతో అక్కడక్కడ చిన్నపాటి ముంపు గురైన ప్రదేశాలను ఆయన సందర్శించి అందుతున్న సదుపాయాలపై పరివాహక ప్రాంత కుటుంబాలను అడిగి తెలుసుకున్నారు అవసరమైన మేరకు అందరూ పునరావస కేంద్రాలకి తరలిరావాలని అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా పూర్తి చేసామని అన్ని వసతులు ఉన్నాయని , ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ ఉంటుందని గ్రామస్థలి ఎవరు అధైర్య పడద్దని ఆయన తెలియజేశారు.