సిరాన్యూస్, బేల
కేజీబీవీని తనిఖీ చేసిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ భాను బేగం
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను బుధవారం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ భాను బేగం స్థానిక వివోఏ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్బంగా కమిటీ చైర్మన్ భాను బేగం పాఠశాలలోని విద్యార్థులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి ఆమె భోజనం చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడగగా వారు పెడుతున్నారని సమాధానం ఇచ్చారు. పాఠశాలలోని స్టోర్ రూమ్ ని పరిశీలించిన ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా వీవోఏ సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా అన్ని వసతులు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. కేజీబీవీ లో పది లక్షల రూపాయలు మంజూరు అవడం జరిగిందని, అందులో ఇప్పటికే బాలికల కోసం టాయిలెట్స్,తరగతి గదులలో పనులు పూర్తి అయిందని పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో కేజీబీవీని అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో మరింతగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి గెడం నవీన, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.