సిరా న్యూస్,పామర్రు;
కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారుల బృందం పంటల నష్టాన్ని వేసేందుకు తోట్లవల్లూరు (మ) రొయ్యూరు గ్రామానికి వచ్చారు. రొయ్యూరులో వంతెన వద్ద రైతులు, అధికారులు నష్టపోయిన వివిధ రకాల పంటలను చూపించారు. వరద ఉధృతికి రైతులు నష్టపోయిన విధానాన్ని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, కలెక్టర్ డీకే బాలాజీ, రెవిన్యూ అధికారులు ఛాయాచిత్రాలు, పాడైపోయిన వివిధ రకాల పంట మొక్కలను సెంట్రల్ టీమ్ కు చూపించి వరద తీవ్రతను వివరించారు.
కేంద్ర బృందంలో అనిల్ సుబ్రమణియం, సంయుక్త కార్యదర్శి, (IS-I & CS), కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నాయకత్వంలో రాకేష్ కుమార్,నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, హైదరాబాద్ డాక్టర్. ఎస్ వి ఎస్ పి శర్మ, సైంటిస్ట్, కలెక్టర్ డీకే బాలాజీ, ఆర్డీవో రాజు, తాసిల్దార్ కుసుమకుమారి పాల్గొన్నారు