సిరాన్యూస్, ఇచ్చోడ
నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా షేక్ ఇమ్రాన్
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన షేక్ ఇమ్రాన్‌ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా నియామకమయ్యారు. ఈ సందర్బంగా నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సంస్థ చైర్మన్ అమాన్ గుప్తా, జాతీయ అధ్యక్షుడు సునీల్ కుమార్‌లు చేతుల మీదుగా మంగళవారం ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా నాకు నాపై మరింత నమ్మకంతో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా నియమించడం పట్ల సంస్థ చైర్మన్ అమాన్ గుప్తా, జాతీయ అధ్యక్షుడు సునీల్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన షేక్ ఇమ్రాన్ ను గ్రామస్తులు శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.