సిరాన్యూస్, భీమదేవరపల్లి
భీమదేవరపల్లి లో సభ్యత్వ నమోదు ప్రారంభం: బీజేపీ మండల అధ్యక్షుడు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్
భీమదేవరపల్లి మండలంలో గురువారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ అన్నారు. ఈసందర్బంగా ముల్కనూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు దుర్గసింగ్, కట్కూరి రాజుకుమార్, కుచన సతీష్, మోర కుమారస్వామి, ఉప్పుల ప్రవీణ్, వేముల రాజ్ కుమార్ పార్టీ ఆన్ లైన్లో సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. అనంతరం పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ మాట్లాడుతూ భీమాదేవరపల్లి మండలంలోని 22 గ్రామాల్లో 49 పోలింగ్ బూత్ లలో బూత్ కు 200.చొప్పున సభ్యత్వ నమోదు చేసేందుకు పార్టీ నాయకత్వం లక్ష్యం నిర్దేశించిందన్నారు.ఇంటింటికి తిరుగుతూ పార్టీ సభ్యత్వ నమోదు కోఆర్డినేషన్ చేసేందుకు మండల అధ్యక్ష ప్రధానకార్యదర్శులతో పాటుగా 21 మంది టీం సభ్యులను పార్టీ అధిష్టానం నియమించిందని తెలపారు. నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి నేటి నుండి సెప్టెంబర్ 25.వరకు సభ్యత్వ లక్ష్యాన్ని పూర్తిచేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటనలు సాగిస్తూ పండుగ వాతావరణంలో సభ్యత్వ నమోదు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ తో పాటు సీనియర్ నాయకుల దుర్గసింగ్, గండు సారయ్య, ఉషాకోయిల కిషన్, గుండెల్లి సదానందం, శ్రీరామోజు శ్రీనివాస్, మ్యాకల రాజు, చీదురాల రమేష్, దొంగల వేణు, పిల్లి రవీందర్, మ్యాకలరాజు , కంకల సదానందం, లక్కీరెడ్డి మల్లారెడ్డి, తీగల రాజు, దొంగల రాణా ప్రతాప్, బండారి కర్ణాకర్, అయిత సాయి, బొజ్జపురి పృథ్వీరాజ్, సింగం రాజేందర్, సోప్పరి నవీన్, బోడ మహేష్, మండెడ్ల ఉదయ్, బోడ రాజు. చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.