సిరాన్యూస్, ఓదెల
తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ శ్రీకోయ శ్రీహర్ష
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో పలు గ్రామాల్లో గురువారం కలెక్టర్ శ్రీకోయ శ్రీహర్ష పర్యటించారు. ఈసందర్బంగా ఓదెల మండలంలో కనగర్తి మడక ఓదెల గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తాసిల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం లో రికార్డులను పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పోలోజు రమేష్ అనే కాంట్రాక్టర్ పాఠశాలలో గేటు డోర్ తలుపులు, వాటర్ ట్యాంక్ ఇతరాత్రా పనులు చేసినందుకు గాను ఐదు లక్షలు బిల్లులు రావడం లేదని కలెక్టర్ కి రాతపూర్వకంగా విన్నవించుకున్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో జి తిరుపతి, తహసీల్దార్ యాకన్న,ఎంపీఓ, ఎంఈఓ ఏపీఎం ప్రభుత్వ అధికారులు తదితరులు ఉన్నారు.