సిరా న్యూస్, ఆదిలాబాద్ రూరల్:
పి అర్ టి యు టిఎస్ ఆదిలాబాద్ రూరల్ మండల నూతన కార్యవర్గం ఎన్నిక….
ఆదిలాబాద్ రూరల్ మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని పి ఆర్ టి యు సంఘ భవనంలో ఏర్పాటుచేసిన సర్వసభ్య సమావేశంలో ఆదిలాబాద్ రూరల్ మండల శాఖ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా దాసరి వెంకటరమణ, తూము అమరేందర్ లతో పాటు అసోసియేట్ అధ్యక్షులుగా జావిద్ అలీ, మహిళా అధ్యక్షులుగా రమారాణి, కార్యదర్శిగా టి సంతోష్ కుమార్, మహిళా కార్యదర్శిగా ద్రౌపతి బాయి లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా కొడిమెల మధుసూదన్, ఉష్కం తిరుపతి వ్యవహరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు దాసరి వెంకటరమణ మాట్లాడుతూ… ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు.