సిరా న్యూస్, ఆదిలాబాద్:
సిసిఐలో పత్తికొనుగోలు సమస్యలను పరిష్కరించాలి.. బండి దత్తాత్రి..
సీసీఐలో పత్తి కొనుగోలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీసీఐ ఆదిలాబాద్ ఎ.డి శ్రీనివాస్ కి తెలంగాణ రైతు సంఘం సభ్యులు వినతి పత్రం అందజేశారు. రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు చెల్లించాలని.మహిళా పట్టాదారు కాకుండా కుటుంబ సభ్యులు ఎవ్వరు వచ్చిన పత్తి అమ్ముకొనే అవకాశం కల్పించాలని కోరారు.రైతులు దూరపు ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బంది పడకుండా అక్కడ కనీస సౌకర్యాలు, త్రాగునిటీ వ్యవస్థను కల్పించాలని కోరారు. సమస్యలను పరిష్కరిస్తానని ఎడి శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు బండి దత్తాత్రి,సంతోష్ రావు,సుదర్శన్,స్వామి,రాందేవ్ తదితరులు పాల్గొన్నారు.