అశ్వాపురం పోలీస్ స్టేషన్ కు తరలింపు
సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
కరకగూడెం మండలంలోని రఘునాధపాలెం లో సెప్టెంబర్ 5 జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన సంఘటనపై, రాష్ట్ర పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ జనరల్ సెక్రెటరీ నారాయణ మరో నాలుగురు తో కలిసి కరకగూడెం బయలుదేరి వెళుతుండగా మణుగూరులోని హనుమాన్ టెంపుల్ వద్ద ఉదయం 7 గంటలకు సిఐ సతీష్ కుమార్ పోలీస్ సిబ్బంది ఆరుగురిని అదుపులోకి తీసుకొని ప్రైవేట్ స్కూల్ బస్సులో అశ్వాపురం పోలీస్ స్టేషన్ తరలించారు. అశ్వాపురం ప్రాంతంలో సిఐ అశోక్ రెడ్డి మరో ఆరుగురిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. మీడియాని అనుమతించకుండా గేటుకు తాళాలు వేసి పై అధికారులు మీడియాని అనుమతించవద్దని తెలిపారన్నారు.