-రానున్న రోజులలో మంథని ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు కంపెనీలు
-మారుమూల గ్రామాల్లో ఉపాధి కల్పన కోసం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందిస్తాం
-రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
సిరా న్యూస్,మంథని;
మారుమూల మంథని నియోజకవర్గంలోని చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు.
మంథని పట్టణం గోదావరిఖని రోడ్డులో గల గీట్లస్ హబ్ లో శనివారం హైదరాబాద్ కు చెందిన సెంటిలియన్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాఫ్ట్ వేర్ నూతన బ్రాంచ్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.అనంతరం రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ మారుమూల మంథని ప్రాంతంలో సాఫ్ట్ వేర్ కంపెనీ స్థాపించడం చాలా సంతోషకరమని అన్నారు. రానున్న రోజులలో మంథని ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు కంపెనీలు రానున్నాయని వాటితో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకెళుతుందని అన్నారు. ఈ ప్రాంత నిరుద్యోగుల బాధలు తొలగుతాయని వారన్నారు.మరి కొన్ని రోజులలో స్కిల్ యూనివర్సిటీని మన ప్రాంతంలో స్థాపించి విద్యార్థులకు కోచింగ్ ఇప్పిచ్చి పూర్తి అవగాహన కల్పిస్తూ వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు.మా మంథని ప్రాంత మేధస్సుకు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది, మంథని నుండి ప్రతి దేశంలో పని చేసే వారు ఉన్నారన్నారు.
మారు మూల గ్రామాల్లో ఉపాధి కల్పన కోసం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఈవో వెంకట్ చుండి, డైరెక్టర్లు రాధా కిషోర్, సిద్ధార్థ, వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్ సుధాకర్ కమ్మిశెట్టి, వైస్ ప్రెసిడెంట్ వైర్లెస్ డివిజన్ హరి కమలాపురం, జనరల్ మేనేజర్ జ్ఞానేశ్వర్ రెడ్డి, మంథని సీఈవో సిద్దు, మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.