Congress Sama Rupesh Reddy: ఆర్థిక సాయం అంద‌జేసిన యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి

సిరాన్యూస్‌, బేల‌
ఆర్థిక సాయం అంద‌జేసిన యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి

పుట్టిన పదిహేను రోజులకే తల్లిని కోల్పోయిన ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని దుబ్బగూడ గ్రామ పంచాయతీలోని టెమ్రిగూడ గ్రామనికి చెందిన నవజాత శిశువుకు ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి శిశువు పాల డబ్బాల కోసం తన వంతుగా 3000 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని సోమవారం కుటుంబ సభ్యులకు అందజేశాడు.బేల మండలంలోని టేమ్రిగూడ కు చెందిన ఆదివాసి మహిళ మారుబాయి 15 రోజుల క్రితం నవజాత మగ శిశువుకు జన్మనిచ్చింది.ఈ క్రమంలో కొంత అనారోగ్యానికి గురైన ఆమెను కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు.అక్కడి వైద్యులు పరీక్షించి ఆమెకు మెదడులో బ్లడ్ క్లాట్ అయిందని తెలియజేశారు.ఈ క్రమంలో ఆమెకు చికిత్స చేసిన వైద్యులు అది సక్సెస్ కాకపోవడంతో నాలుగు రోజుల్లో ఆమె మృతి చెందింది.దీంతో ఆమె బాబుకు పాల డబ్బాలు అవసరమని గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న సామ రూపేష్ రెడ్డి తన వంతుగా బాబుకు అండగా నిలిచి తన మానవత్వాన్ని చాటుకున్నారు.ఇది తెలిసిన పలువురు ఆయనను అభినందించగా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్య‌క్ర‌మంలో ప్రమోద్ రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *