సిరా న్యూస్,బీజాపూర్;
ఛత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. చేతబడి నెపంతో గ్రామస్థులు కుటుంబాన్ని మొత్తాన్ని కొట్టి చంపారు. తెలంగాణ ఛత్తీస్ ఘడ్ బోర్డర్ కుటు పోలీస్ స్టేషన్ ఇట్కాల గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. ఇట్కాల గ్రామస్తులకు చేతబడి చేస్తున్నారనే నెపంతో ఓ కటుంబంలో ఐదుగురిపై కర్రలతో డాడి చేసారు. గ్రామస్తులు దాడిలో ఐదుగురు కుటుంబసభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతులు మౌసం కన్న (60),మౌసం బుచ్చా (34)మౌసం బిరి, మౌసం ఆర్థో (32,కర్కా కాచిలుగా గుర్తించారు. గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేసారు.