సిరా న్యూస్,విశాఖ;
సముద్రంలోకి వేట కెళ్ళిన మత్స్య కారుల బోటు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బోటులో ఐదుగురు మత్స్యకారులు ఉన్నారని మత్స్యకారుల నేత కోలా గురువులు అన్నారు. బోట్ నిరంతరంగా పని చేయడం వల్ల బోటు ఇంజిన్ నుంచి మంటలు వచ్చాయి. ఐదుగురు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. బోటు ప్రమాదంతో సుమారు 35 లక్షలు ఆస్తి నష్టం సంభవించింది. బాధితులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.