సిరా న్యూస్, బేల
పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి : ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు ఆడే శంకర్
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు,పేకాట, గుట్కా,అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు ఆడే శంకర్ ఆరోపించారు.మంగళవారం స్థానిక కొమరం భీమ్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో అక్రమ ఇసుక,ఇరవై నాలుగు గంటలు బెల్ట్ షాప్ లలో మద్యం విక్రహిస్తున్న సంబంధిత పోలీస్ అధికారుల కండ్ల ముందు అక్రమ దందాలు జరుగుతున్న చూసి చూడనట్లుగా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. పేకాట ఆడుతున్న వ్యక్తులను పట్టుకొని కొందరి పై కేసులు పెట్టి వారిని తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేస్తున్నారు.కానీ కొందరు బడా బాబుల వద్ద డబ్బులు తీసుకోని వాదిలాస్తున్నారు కానీ అలాంటి వారిని తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేస్తలేరని ఆరోపించారు. ఇలా పక్ష పాత ధోరణిలో వ్యవహారిస్తున్న ఎస్.ఐ పైన పోలీసు ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబందించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. ఉన్నత అధికారులు సంబంధిత ఎస్.ఐ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని యెడల మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ అనుబంధ సంఘాలతో పెద్ద ఎత్తున్న ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.