పాల్గోన్న స్పీకర్ ప్రసాద్ కుమార్
సిరా న్యూస్,వికారాబాద్;
సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజునని..భారత దేశంలో తెలంగాణ ప్రాంతం విలీనమై నేటికీ 77వ సంవత్సరంలోకి అడిగిడుతుందని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా ప్రసాద్ కుమార్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత దేశానికి 1947ఆగస్టులో స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణ నవాబుల పాలనలో ఉండిందన్నారు. నవాబుల కు వ్యతిరేకంగా సాయుధ పోరాటం ఒకవైపు… భారత సైన్యం మరోవైపు పోరాటం చేయడంతో తలొగ్గిన నవాబు సెప్టెంబర్ 17 న తెలంగాణను భారత్ లో విలీనం చేశారన్నారు. అందుకే రాష్ట్రం ప్రభుత్వం సెప్టెంబర్ 17 ను అధికారికంగా ప్రజా పాలన పేరుతో వేడుకలు నిర్వహిస్తోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి , యాదయ్య, రామ్మోహన్ రెడ్డి,కలెక్టర్ ప్రతీక్ జైన్ , ఎస్పీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.