సిరా న్యూస్,ఓదెల
జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎంపీడీవో తిరుపతి
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంపై జాతీయ జెండాను ఎంపీడీవో తిరుపతి ఆవిష్కరించారు.ఈ సందర్బంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ ఓ షబ్బీర్ భాష, ఓదెల గ్రామ కార్యదర్శి చంద్రారెడ్డి, ఏపీవో రమేష్, వెంకటేశ్వర్లు, సతీష్. ఈసీ శ్వేత, తదితరులు పాల్గొన్నారు.