సిరాన్యూస్,చిగురుమామిడి
సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సిగ్గుమాలిన చర్య
* బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య
* చిన్న మూల్కనూర్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం
సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సిగ్గుమాలిన చర్య అని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. రాష్ట్ర సచివాలయం,తెలంగాణ అమరజ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడంపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న మూల్కనూర్ గ్రామంలో మంగళవారం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని శుద్ధి చేసి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా మామిడి అంజయ్య మాట్లాడుతూ సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే సిగ్గుమాలిన చర్యగా మండిపడ్డారు.తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యను తెలంగాణ వాదులంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారన్నారు.తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టేందుకు ఆ స్థలాన్ని మాజీ సీఎం కేసీఆర్ ఎంపిక చేశారని చెప్పారు. అట్టి స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు.తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని అక్కడ ఎలా పెడతారని మండిపడ్డారు. ఢిల్లీ బాసుల మెప్పుకోసం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరాన్ని తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. వెంటనే చేసిన తప్పును సరిదిద్దుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి,నాయకులు సాంబారి కొమురయ్య, పెనుకుల తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి బెజ్జంకి రాంబాబు,పెసరి రాజేశం, సిద్ధంకి రాయమల్లు, గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర తిరుపతి గౌడ్,గీట్ల తిరుపతిరెడ్డి,కొమ్ము కొమరయ్య,నాయకులు పెరాల తిరుపతిరావు, బరిగెల సదానందం, కయ్యం సారంగం, కయ్యం వీరయ్య పటేల్, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.