సిరాన్యూస్,బేల
జాతీయ జెండాను ఆవిష్కరించిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్
* బేలలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా కాంగ్రెస్ మండల అద్యక్షులు ఫైజుల్లా ఖాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 17 సెప్టెంబర్ 1948 లోహైదరాబాద్ నిజాం స్టేట్ విలీన దినం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకమని తెలిపారు. దేశ స్వాతంత్ర పోరాటంలో గాని, హైదరాబాద్ విలీనంలో కానీ బిజెపి పార్టీకి ఎటువంటి పాత్ర లేదని వివరించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండావార్, మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే ,నాయకులు వామన్ రావు వాన్ఖడే, ఎస్సి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు విట్ఠల్ రావ్ , రాజు, రవి, గట్లవార్ కుండలిక్ పురుషోత్తమ్, కరీం భాయి, తదితరులు పాల్గొన్నారు.