సిరాన్యూస్, ఆదిలాబాద్
న్యాయవాది సుధీర్ కుమార్ సంగెంకు మేఘా సిటీ నావకళా వేదిక ఆహ్వానం
ప్రతీ సంవత్సరం ప్రముఖ ఇంజనీర్లకు ఇచ్చే అత్యుత్తమ అవార్డు ” మోక్ష గుండం విశ్వేశరయ్య మెమోరియల్ అవార్డు 2024″ ప్రదానోత్సవం తెలంగాణ ప్రభుత్వ భాషా సంస్కృతిక శాఖ, మేఘా సిటీ నావకళా వేదిక సంయుక్తoగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది, సంగెం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సుదీర్ కుమార్ ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ నెల 21 నా హైదరాబాద్ నగరంలోని రవీంద్రభారతి వేదికలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , బీసీ కమిషన్ మాజీ చైర్మన్ శ్రీ వాకులాభారం కృష్ణ మోహన్ , ప్రముఖ సంఖ్యా శాస్త్ర నిపుణులు సరస్వతి పుత్రులు శ్రీ దైవజ్ఞ శర్మ ఆధ్వర్యంలో అవార్డులు అందజేస్తారు.ఈ కార్యక్రమానికి ఆయనను ప్రత్యేక ఆహ్వానించడం పట్ల ఇది జిల్లా ప్రజలకు దక్కిన అదృష్టం అని సుధీర్ కుమార్ సంగెం పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీ మల్లికార్జున రావ్, రాఘవ , సినీ ప్రముఖులు తదితరులు పాల్గొననున్నారు.