భారీగా ట్రాఫిక్ జామ్..
సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని పూసుగూడెం గ్రామస్తులు రోడ్డెక్కారు..బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మద్యం మత్తులో కారు నడిపి, విద్యార్థుల ఆటోను డీ కొట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు..మరణించిన విద్యార్థి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని,,గాయపడిన పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు..గ్రామంలోని పెద్దలు నుంచి పిల్లలు వరకు ప్రధాన రహదారిపై బైఠాయించటంతో రహదారిపై ఉద్రిక్తత నెలకొంది..ఈ క్రమంలో రోడ్డు పై ఇరు వైపుల భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి..ఇంత ప్రమాదం జరిగితే కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు…సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని నచ్చచెప్పడంతో ధర్నా విరమించుకున్నారు..