జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సురేష్
సిరా న్యూస్,పెద్దపల్లి;
జిల్లాలో ఈ నెల 29న జరిగే యువజన ఉత్సవాలకు ఆసక్తి గల యువతీ, యువకులు పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సురేష్ ఒక ప్రకటనలో కోరారు. 15 నుంచి 29 ఏళ్లలోపు గల వారు ఈ నెల 22 లోగా సంప్రదించాలని తెలిపారు. యువ కళాకారులకు జానపద నృత్యం (గ్రూప్), జానపద గేయం నందు10 మంది మించకుండా, జానపద నృత్యం, జానపద గేయం వ్యక్తిగతవిభాగంలో 5 మంది మించకుండా పోటీలు నిర్వహిస్తున్నట్లు, అలాగే కథా రచన (స్టోరీ రైటింగ్), పోస్టర్ తయారీ ( పోస్టర్ మేకింగ్), ప్రకటనలు (డిక్లమేషన్), ఫోటోగ్రఫీ, యువ కృతిలో బాగంగా హస్తకళలు, వస్త్రాలు, వ్యవసాయ మొదలగు పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 29న పెద్దపల్లి పట్టణములోని అమర్ చంద్ కళ్యాణ మండపంలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు పోటీలు నిర్వహించబడతాయని, ఈ పోటీలకు ఎలాంటి రుసుము లేదని, గెలిచిన మొదటి స్థానం వారిని రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయిలో గెలిచిన వారు జాతీయ స్థాయిలో పాల్గొంటారని తెలిపారు. పోటీలలోపాల్గొనే అభ్యర్ధులు ప్రతి ఒక్కరూ తమ అంశాలకు సంబందించిన వాయిద్య పరికరాలు, కాస్ట్యూములతో రావలసి ఉంటుందని, పోటీలలో పాల్గొనే వారు రవాణ, వాయిద్య పరికరాలకు, కాస్ట్యూములకుఅయ్యే ఖర్చును వ్యక్తిగతంగా భరించాలని, అలాగే పైన తెలిపిన అంశాలలో ప్రతిభ గల అక్షరాస్యులు, నిరక్షరాస్యులు పాల్గోన వచ్చని అన్నారు. ఈ పోటీలలో పాల్గొనే వారు ఆధార్ కార్డు జిరాక్స్తీసుకురావాలని పోటీలలో పాల్గోనుటకు పెద్దపల్లి జిల్లా నివాసులు మాత్రమే అర్హులని తెలిపారు. అభ్యర్థులు తమ పేర్లను జిల్లా కలెక్టర్ కార్యాలయములోని మొదటి అంతస్తు రూమ్ నెం.225 లోని జిల్లాయువజన, క్రీడల శాఖ కార్యాలయములో సాయంత్రం 5 గంటల లోగా నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరములకు 9440167222 నందు సంప్రదించాలని జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ఆప్రకటనలో పేర్కొన్నారు.