జోలే కట్టి వాగు దాటిస్తున్న కుటుంబ సభ్యులు
సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
.ఆళ్లపల్లి మండలం పురుగుల మందు తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..ఆళ్లపల్లి మండల పరిధిలోని చంద్రాపురం గ్రామానికి చెందిన చందా సమ్మయ్య(50) కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగాడు. సమ్మయ్య కొడుకు దుక్కిటెద్దును కోనుక్కోవాలని తండ్రిని డబ్బులు అడిగాడు. దాంతో ఆయన నిరాకరించారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్థాపానికి గురైన సమ్మయ్య పురుగుల మందు తాగి శుక్రవారం మృతి చెందాడు చంద్రాపురం గ్రామం వద్ద జల్లేరు వాగుపై వంతెన లేకపోవడంతో సమ్మయ్య మృత దేహాన్ని కుటంబ సభ్యులు జోలే కట్టి వాగు దాటించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై రతీశ్ తెలిపారు. పోస్టుమార్టం నిమమిత్తం ఇల్లందు తరలించారు.