Youth Congress Sama Rupesh Reddy: జీరో అకౌంట్ ప్రారంభం : యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి

సిరా న్యూస్‌,బేల‌
జీరో అకౌంట్ ప్రారంభం : యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి
*సాంగిడిలో ఎస్.బి.ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపు

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలు (బ్యాంక్ అకౌంట్స్) లేనివారికి శనివారం బేల మండలంలోని ఎస్.బి.ఐ.బ్యాంక్ ఆధ్వర్యంలో జీరో ఖాతాలను ప్రారంభించారు.ఇందుకోసం ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో వారి విజ్ఞప్తి మేరకు గ్రామంలో ఎస్.బి.ఐ.బ్యాంకు వారు ప్రత్యేక క్యాంపు గ్రామంలో ఏర్పాటు చేశారు.ఈ క్యాంపులో బ్యాంకు ఖాతా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు కొత్తగా ప్రారంభించిన ఇన్సూరెన్స్ పథకం ఖాతాదారులకు ఎంతగానో మేలు చేస్తుందని బ్యాంక్ అధికారులు తెలియజేశారు.మొదటి రోజు సుమారు 100 మందికి పైగా బ్యాంక్ అధికారులు జీరో ఖాతాల అకౌంట్ అందజేశారు. ఇందులో భాగంగా సామ రుపేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మనిషి బ్రతకడానికి అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని అందులోనూ ప్రమాదాలు జరగడం అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని గమనించి ఎస్.బి.ఐ.బ్యాంక్ ద్వారా అందిస్తున్న ఇన్సూరెన్స్ పథకాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి దీనిని అందించాలనే సదుద్దేశంతో ఉచితంగా జీరో ఖాతాలను బ్యాంక్ అకౌంట్స్ లేని ప్రజల చేత తెరిపించడం జరిగిందని అన్నారు.ఈ క్యాంపు ప్రతి ఒక్కరికి ఉచితంగా జీరో బ్యాంక్ అకౌంట్ ఇచ్చేంతవరకు గ్రామంలో కొనసాగుతుందని తెలిపారు.ప్రజలు సైతం ఎస్.బి.ఐ.బ్యాంక్ ద్వారా కలిపిస్తున్న ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్య‌క్ర‌మంలో బ్యాంక్ మేనేజర్ బొంత అశోక్,తో ఉద్యోగులు సిబ్బంది ప్రమోద్,సాగర్,యువజన కాంగ్రెస్ నాయకులు మంచికంటి సాయి,అడ్డికి సునీల్ ప్రవీణ్,మహేందర్,ప్రపుల్,విట్టల్,ప్రేమ్,కద్రప్ ప్రవీణ్ , ఆకాష్, కుమార్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *