సిరాన్యూస్,బేల
ఈనెల 25 నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు : ప్రిన్సిపాల్ డా వరప్రసాద్ రావు
తెలంగాణ లో దోస్త్ ద్వారా వివిధ దశలలో అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. దానితో తెలంగాణ ఉన్నత విద్య మండలి ప్రైవేట్ కాలేజ్ లు , సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు ల లో స్పాట్ అడ్మిషన్లు కి అవకాశం ఇచ్చారు.ఈ నెల 25 నుండి 27 వరకు ఈ అవకాశం ఉందని బేలా కీర్తన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డా వరప్రసాద్ రావు ఒక ప్రకటన లో పేర్కొన్నారు. అయితే ఈ దశ లో జాయిన్ అయిన వారికి ప్రభుత్వ రీ ఎంబెర్స్మెంట్ ఉండదని తెలిపారు. వారే సంబంధింత ఫీ లు చెల్లింపు చేయవలిసి ఉంటుందని పేర్కొన్నారు. ఇది పూర్తిగా చివరి అవకాశమని, ఈ అవకాశం ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొవాలని కోరారు. పూర్తి వివరాలకు కోసం వైస్ ప్రిన్సిపాల్ డా గెడం ప్రవీణ్, దోస్త్ కో ఆర్డినేటర్ సాగర్ ని కానీ సంప్రదించవచ్చు అని తెలిపారు