సిరా న్యూస్,బెంగళూరు;
ఢిల్లీలో శ్రద్ధా వాకర్ తరహాలో బెంగళూరులో మహాలక్ష్మి అనే మహిళ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.. బెంగళూరు నగరంలోని వయాలికావల్‌లో నివసిస్తున్న 29ఏళ్ల మహిళను దారుణంగా హత్య చేసి 30కి పైగా ముక్కలు చేసి ఫ్రీజర్‌లో దాచారు.. ఆ తర్వాత ఆమె ఫొన్ స్విచ్ఛాఫ్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శరీరం ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్లో ఉంచారని.. కుళ్లిపోయిన స్థితిలో శరీర భాగాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఆమెను హత్యచేసి.. 30 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఆమెను హత్యచేసిన వ్యక్తి ఎవరో గుర్తించారు. అతడ్ని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. బెంగళూరు నగర కమిషనర్ దయానంద్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన నిందితుడ్ని గుర్తించామని చెప్పారు. అతడిది వేరే రాష్ట్రమని అన్న ఆయన.. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తు్నట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఉండగా ఇంతకంటే వివరాలను వెల్లడించలేమని ఆయన అన్నారు.హతురాలు మహాలక్ష్మీ.. మల్లేశ్వరంలోని ఓ మాల్లో పనిచేస్తూ.. భర్తకు దూరంగా ఉంటోంది. అయితే, ఒక వ్యక్తి రోజూ వచ్చి ఆమెను తీసుకెళ్లి.. మళ్లీ దింపుతాడని స్థానికులు ద్వారా పోలీసులకు తెలిసింది. దీంతో అతడే ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని గుర్తించడానికి 4-5 రోజుల ముందు హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.ఫ్రిజ్‌లో మహాలక్ష్మి ఛిద్రమైన అవశేషాలు చూసి కుటుంబసభ్యులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.అయితే, నిందితుడితో పాటు బాధితురాలిది వేరే రాష్ట్రమని, కర్ణాటకలో ఉంటున్నారని పోలీస్ కమిషనర్ చెప్పారు. కాగా, ఈ కేసుపై కర్ణాటక హోమ్ మంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ.. పోలీసులు ప్రధాన నిందితుడ్ని గుర్తించారని, అతడి సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని అన్నారు. అలాగే, పూర్తివివరాలను దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని ఆయన చెప్పారు. అలాగే, నగరంలో మహిళ భద్రత గురించి తీసుకుంటున్న చర్యల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ఈ విషయంలో మేము చర్యలు తీసుకుంటున్నామని, దీనిపై మేము అప్రమత్తంగా ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు మరింత వేగవంతంగా జరుగుతోంది.అయితే.. మహాలక్ష్మి హత్య కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించినట్లు బెంగళూరు పోలీసు కమిషనర్ బి దయానంద సోమవార తెలిపారు. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, ప్రధాన నిందితుడిని గుర్తించామని, అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన కమిషనర్ దయానంద పలు కీలక విషయాలను వెల్లడించారు. నిందితుడు బయటి రాష్ట్రంలో ఉన్నాడని.. తాము చెప్పే విషయాలు నిందితులకు సహాయపడే అవకాశం ఉన్నందున ప్రస్తుతానికి మరింత సమాచారం ఇవ్వలేమని తెలిపారు.అంతకుముందు రోజు కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ.. మహిళ మృతికిసంబంధించి పోలీసులు చాలా సమాచారాన్ని సేకరించారన్నారు. హత్య వెనుక పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారని, అయితే అతని పాత్రను నిర్ధారించడానికి మరిన్నిఆధారాలు అవసరమని మంత్రి అన్నారు.మహాలక్ష్మి అనే మహిళ గత ఐదు నెలలుగా బెంగుళూరులోని వయాలికావల్‌లోని వినాయక నగర్లో ఒంటరిగా నివాసముంటోంది.. తన భర్త హుకుమ్ సింగ్ నేలమంగళలో నివసిస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఒంటరిగా నివసిస్తోంది.. సెప్టెంబరు 21న ఆమె నివసిస్తున్న ఇంటి ఫ్రిజ్‌లో ఆమె శరీర భాగాలను కుళ్లిపోయిన స్థితిలో గుర్తించారు. దుర్వాసన రాకుండా రసాయనాలు చల్లి ఇంటికి తాళం వేసి పరారైనట్లు తెలిపారు. అయితే బాధితురాలి ఫోన్ సెప్టెంబర్ 2న అయిందని, అదే రోజు హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు.