సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
కుదునూరు ఆర్.కొత్తగూడెం ప్రధాన రహదారిపై భారత కమ్యునిస్టు పార్టీ (మావోయిస్ట్) పేరిట వాల్ పోస్టర్లు, కరపత్రాలు కలకలం రేపాయి. .ఈ పోస్టర్లలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) 20వ స్థాపన వార్షికోత్సవాన్ని 21 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 20 వరకు తెలంగాణ వ్యాప్తంగా సమరోత్సహంతో జరుపుకోవాలని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో తలపెట్టిన అనాగరిక కౄరమైన ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా రాజకీయ, సైనిక పోరాటాలలో విరోచితంగా తలపడి వారిని ఓడించాలని, పార్టీని, విప్లవోద్యమాన్ని కాపాడుకోవాలంటూ మావోయిస్టులు పిలుపునిచ్చారు.