Gajula Mohan: విద్యార్థుల‌కు టై, బెల్ట్‌లు అంద‌జేసిన గాజుల మోహన్

సిరాన్యూస్‌, కాల్వశ్రీరాంపూర్
విద్యార్థుల‌కు టై, బెల్ట్‌లు అంద‌జేసిన గాజుల మోహన్

కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని అంకంపల్లి గ్రామానికి చెందిన గాజుల మోహన్ తనవంతు సాయంగా అంకంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథ‌మిక పాఠశాలలోని విద్యార్థుల‌కు టై,బెల్ట్‌లు, బ్యాడ్జిల‌ను అంద‌జేశారు. మంగ‌ళ‌వారం పాఠ‌శాల‌లో చ‌దువుతున్న 46 మంది విద్యార్థిని విద్యార్థులకు టై,బెల్ట్‌లు, బ్యాడ్జిల‌ను మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.అనంతరం సారయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే ఎక్కువగా కలెక్టర్‌, డాక్టర్, పోలీస్, ఉపాధ్యాయులు. రాజకీయ నాయకులు అయ్యార‌ని తెలిపారు. ఎమ్మెల్యే విజ్జన్న కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివారని గుర్తు చేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల మోహన్‌ను, సారయ్య గౌడ్ లను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వినయ్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *