సిరాన్యూస్, హుజురాబాద్
వీఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ లో ఘనంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలు
హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి లోని వీఎస్ఆర్ డిగ్రీ కాలేజ్‌లో ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. వాలంటీర్లు స్వీట్లు మరియు పండ్లు పంపిణీ చేశారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రజిత మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్ఎస్ఎస్ సేవా ద్వారా ఎన్నో రకాల సామాజిక సేవాలు ప్రజలకు నిరంతరం అందుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో తిరుపతి, హరీష్, కోమల, గణేష్, శారద, భాస్కర్, మహేష్, విద్యార్థులు పాల్గొన్నారు.