శంషాబాద్ కు తిరిగివచ్చిన ఎయిర్ ఇండియా విమానం
సిరా న్యూస్,రంగారెడ్డి;
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తిరుపతి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం లో టెక్నికల్ ప్రాబ్లం తో తిరిగి హైదరాబాద్ కు వచ్చింది. ఉదయం 6:30 కు హైదరాబాద్ నుంచి తిరుపతి విమానం బయలుదేరింది. తరువాత పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించారు. దాంతో విమానాన్ని మార్గమధ్యలో తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేసారు. విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నారు, వీరంతా సురక్షితం. దాదాపు రెండు గంటల నుండి తమను పట్టించుకున్న నాధుడు లేడు అంటూ ఎయిర్పోర్టులో ఆందోళనకు ప్రయాణికులు దిగారు. ఇందులో చిన్న పిల్లలతో సహా కొంతమంది ప్రయాణిస్తున్నారు, వీరికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు ఎప్పుడు పంపిస్తారంటూ విమాన సిబ్బందిని నిలదీస్తున్న పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు