సిరాన్యూస్, తలమడుగు
గురి తప్పకూడదు: ఎస్పీ గౌష్ ఆలం
* ఫైరింగ్ రేంజ్‌లో ఫైరింగ్ చేసిన ఎస్పీ
* ప్రతి ఒక్క ఆయుధంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి
* శిక్షణ పోలీసు కానిస్టేబుళ్లకు ఆయుధ పరిజ్ఞానం
ప్రతి ఒక్క ఆయుధంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో ఫైరింగ్ రేంజ్ లో శిక్షణ కానిస్టేబుల్ లకు ఆయుధాలపై పూర్తి పరిజ్ఞానం అందించారు. ఈసందర్బంగా జిల్లా ఎస్పీ గౌష్ స్వయంగా ఫైరింగ్ రేంజ్ లో ఫైరింగ్ చేసి అందులో ఉన్న మెలుకువలు, ఫైరింగ్ చేయు విధానాలపై సిబ్బందికి తెలియజేశారు. అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకున్నప్పుడు, అల్లరి మూకలపై, వివిధ సందర్భాలలో పోలీసు సిబ్బంది చేయు విధులు, టియర్ గ్యాస్, స్టన్ గ్రానైట్, వజ్రా వాహనంలో గ్యాస్ గ్రానైట్ ప్రయోగం లాంటి అంశాలను శిక్షణ కానిస్టేబుల్ లకు జిల్లా ఎస్పీ వివరించారు. అదేవిధంగా ఫైరింగ్ చేయునప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విధివిధానాలపై సిబ్బందికి తెలియజేశారు. ఫైరింగ్ పొజిషన్స్ ,శత్రువుల పై దాడి చేయు విధానాలు తదితర అంశాలను జిల్లా ఎస్పీ వివరించారు.కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆపరేషన్ బి సురేందర్ రావు, డీఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, పోలీసు శిక్షణ కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.